పట్టభద్రుల మద్దతుతో కూటమి అభ్యర్థి రాజశేఖర్ విజయం ఖాయం 

 

పట్టభద్రుల మద్దతుతో కూటమి అభ్యర్థి రాజశేఖర్ విజయం ఖాయం

మల్లేపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, పోతుల మోహనరావు విస్తృత ప్రచారం

కాకినాడ జిల్లా గండేపల్లి ఫిబ్రవరి 16 అఖండ భూమి వెబ్ న్యూస్ :

విజ్ఞులైన పట్టభద్రుల మద్దతుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం ఖాయమని విశాఖ జిల్లా టిడిపి అధ్యక్షులు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్సీ అబ్జర్వర్ గండి బాబ్జి, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆదేశాలతో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో పట్టపద్దుల ఎమ్మెల్సీ ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను బలపరచాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంచుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ పట్టభద్రులను ఓట్లు అభ్యర్థించారు. పట్టభద్రుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయకుడు రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తమ అపార అనుభవంతో కృషి చేస్తున్నారని వివరించారు. విద్యావంతులంతా సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఇచ్చారని, అదే ఒరవడిని ఉమ్మడి ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనసాగించాలని కోరారు. నిరుద్యోగ నిర్మూలన, విద్యారంగం పటిష్టత, ఉద్యోగ అవకాశాలు కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులంతా అండగా ఉండాలని కోరారు. ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా తమ విలువైన ఓటును ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాజశేఖర్ కి వేయాలని గండి బాబ్జి, పోతుల మోహనరావు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!