బర్డ్ ప్లూ వైరస్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు… ?
– సంబంధిత అధికారులు బర్డ్ ప్లూ వైరస్ పై చికెన్ షాప్ యజమానులకు అవగాహన కల్పించిన వైనం…
– ఇతర జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించిన కళ్ళు తెరవని అధికారులు..
వెల్దుర్తి ఫిబ్రవరి 16 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో చికెన్ షాప్ యజమానులు అడుగడుగునా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్ర లు చెక్పోస్ట్ల దగ్గర ఆంధ్ర నుండి వెళ్తున్నటువంటి కోళ్లను నిలుపుదల చేస్తున్న సంగతి విదితమే. బర్డ్ ప్లూ వైరస్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలు చికెన్ తినాలా వద్దా అన్న అనుమానాలు వినియోగదారుల మనసులలో ఉన్నది. సంబంధిత అధికారులు మాత్రం బర్డ్ ప్లూ వైరస్ విషయంలో పట్టించుకున్న పాపాన పోలేదు. చికెన్ షాప్ యజమానులు మాత్రం వ్యాపారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. చికెన్ వినియోగదారులకు బార్డ్ ప్లూ వైరస్ వ్యాప్తి చెందితే ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదని వైద్య అధికారులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు మాత్రం బర్డ్ ఫ్లూ వైరస్ తో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. సంబంధిత అధికారులు ఇతర జిల్లాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం షాప్ యజమానులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.