అన్నదాన సత్రానికి స్థలం మంజూరు చేయాలి

 

 

అన్నదాన సత్రానికి స్థలం మంజూరు చేయాలి

అఖండ భూమి-యర్రగొండపాలెం శ్రీశైలం దేవస్థానంలో సుగాలీ (లంబాడీ) బంజార

ప్రజలకు అన్నదాన సత్రం నిర్మించేందుకు స్థలం మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ కె సేవ్యా నాయక్ కోరారు. శనివారం రాష్ట్ర రాజధానిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో సేవ్యా నాయక్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. వినతి పత్రం అందజేశారు. దేశ వ్యాప్తంగా కోటి మంది బంజార సుగాలీ కులస్తులు ఉన్నారని చెప్పారు. వారంతా శ్రీశైలం దేవస్థానానికి వస్తుంటారని తెలిపారు. కానీ అక్కడ ఉండుటకు వసతి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. శ్రీశైలం దేవస్థానం నందు అన్ని కులాల వారికి సత్రాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ తమ కులస్తులకు లేదన్నారు. దీంతో తామంతా వేరే సత్రం వద్దకు వెళ్లగా వారు చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. అందుచేత సుగాలీలకు కుడా అన్నదాన సత్రం ఏర్పాటు చేసుకొనుటకు స్థలం మంజూరు చేయాలని కోరారు. అలాగే యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో గల పుల్లలచెరువు మండలంలోని మురికిమళ్ల తాండాలో నీటి ఎద్దడి అధికంగా ఉందన్నారు. గిరిజనులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఒక డీప్ బోరు వేయించి, ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించి ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఆయనతో పాటు టిడిపి స్టేట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు దారు నాయక్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!