ఇర్రిపాకలో నాలుగో రోజు శివ కేశవుల ప్రతిష్టా మహోత్సవ పూజలు
*కోటిలింగేశ్వరుడికి క్షీరాదివాసం, నీరాజన మంత్రపుష్పాలువెంకటేశ్వరుడికిపద్మ పుష్పములతో యంత్రార్చన నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం
కాకినాడ జిల్లా జగ్గంపేట ఫిబ్రవరి 15: జ్యోతుల నెహ్రూ మణి దంపతులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు, తోట సర్వారాయుడు సునీత దంపతుల యాజమాన్య సంకల్పంతో ఇర్రిపాక గ్రామం లో హరిహర ఆలయ సముదాయం లో ఫిబ్రవరి 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఐదు రోజుల పాటు శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారముగా యువ బ్రహ్మ శ్రీమాన్ పాణి0గిపల్లి సత్య పవన్ కుమారాచార్యులు ఆధర్వయ్యములో జరపబడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమములో మూడవ రోజు 15/2/2025 విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం అగ్నిధ్యానము కుంభారాధన; పద్మ పుష్పముల తో యంత్రార్చన ;పారమాత్మిక విశేష పద్మపుష్పముల హోమం చతుర్దశ కలశారాధన నవకలశారాధన.. విశేష స్నపనము క్షీరాధివాసం అధివాస ప్రధాన హోమములు,సాయంత్రం యాగశాల కార్యక్రమములు అగ్ని ధ్యానం కుంభారాధన …సర్వదైవత్య వైష్ణవ ప్రధాన హోమములు క్షీరాధివాస గత స్వామి అర్చన అష్టమంగళ పంచాయుధ స్థాపన చతుర్వేద స్వస్తి నిరాజనం మంత్రపుష్పములు తీర్థ ప్రసాదాలు పంపిణీ జరిగాయి. కోటిలింగేశ్వరుడికి వినాయకపూజ పుణ్యాహవాచనము మండప పూజలు జలాధివాస హోమాలు సాయంత్రం ఐదు గంటలకి కోటిలింగేశ్వర స్వామికి క్షీరాదివాసం నీరాజనం మంత్ర పుష్పాలు దర్బారు సేవ నాలుగో రోజు కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి 17వ తేదీన అంగరంగ వైభవంగా శివ కేశవుల ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల అనీష్ నెహ్రూ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.