పీసా చట్టంపై కమిటీ సభ్యులు అవగాహన కలిగి ఉండాలి 

 

 

పీసా చట్టంపై కమిటీ సభ్యులు అవగాహన కలిగి ఉండాలి

ఎంపీడీవో “ఎస్ కె వి ప్రసాద్,” జడ్పిటిసి “వార నూకరాజు”

కొయ్యూరు అల్లూరి జిల్లా (అఖండ భూమి) ఫిబ్రవరి 15

పీసా చట్టాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని మండల అభివృద్ధి అధికారి ఎస్ కె వి ప్రసాద్ తెలియజేశారు. శనివారం మండల అభివృద్ధి కార్యాలయం సమావేశ మందిరంలో పిసా సభ్యులకు ప్రజాప్రతినిధులకు రెండవ రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఎంపీడీవో ఎస్ కె వి ప్రసాద్ జెడ్పిటిసి వార నూకరాజు మాట్లాడుతూ పీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధికి సమిష్టి సహకారం ఉంటేనే గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యం అవుతుందని దీనికోసం అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు పీసా కమిటీ ఇది విధానాలపై స్పష్టంగా వివరించారు. ఈ శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చూసించారు అలాగే ఈ శిక్షణ తరగతులకు2 27 హాజరు కావలసి ఉండగా 215 మంది హాజరయ్యారని తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!