స్వీపర్ తో డ్రెస్సింగ్ చేయిస్తున్న సూపరింటెండెంట్…..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫిబ్రవరి 15 (అఖండ భూమి) : వచ్చిరాని వైద్య సేవలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోగులకు స్వీపర్ తో డ్రెస్సింగ్ చేయిస్తున్న ఉదాంతం డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికో న మండలం, కాట్రేనికోన ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్ తో డ్రెస్సింగ్ చేయిస్తున్న సూపరింటెండెంట్ ను వెంటనే సస్పెండ్ చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి, శ్రీ చీకురుమెల్లి రవికుమార్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టాఫ్ నర్స్లతో చేయించాల్సిన వైద్యం స్వీపర్లతో చేయించడం ఏమిటా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి ఎంతోమంది ఈ ఉద్యోగానికి అర్హులై చదువుకున్న యువతీ యువకులు చాలా మంది ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసుతం ఉద్యోగాలు చేయడానికి భారంగా ఉన్న వారిని తొలగించి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే.. బాగుంటుందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో సంబంధిత జిల్లా డిఎంహెచ్వో ఉన్నతాధికారికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం