నెల్లూరు నుండి హైదరాబాద్ కి వెళ్తూ మార్గమధ్యంలో మార్కాపురంలో మాట్లాడిన జేఏసీ సభ్యులు.
మార్కాపురం అఖండ భూమి.
.నెల్లూరు నుండి హైదరాబాద్ కి వెళ్తూ మార్గమధ్యంలో మార్కాపురంలో ఆగి ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ జేఏసీ బృందం తో నెల్లూరు జిల్లా పూలే టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మా రవి మరియు సభ్యులు కలిసి సుమారు 1 గంట సేపు సమావేశం కావడం జరిగింది.
.బీసీ ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం పై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జేఏసీ చైర్మన్ మాదాసు రంగనాయకులు, వైస్ చైర్మన్ నల్లబోతుల శ్రీనివాసరావు, డిప్యూటీ సెక్రటరీ దేవలూటి శంకర్, నెల్లూరు జిల్లా పూలే టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మా రవి, వెంకటరత్నం, సభ్యులు మందాటి వెంకటరత్నం, వినోద్, రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ సభ్యత్వ కార్యక్రమం పై అందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది.