కోటపేట శ్రీ ఆంజనేయస్వామి మరియు అవధూత శ్రీ శ్రీ శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద బండలాగుడు పోటీలు
వెల్దుర్తి ఫిబ్రవరి 10 అఖండ భూమి వెబ్ న్యూస్ :
వెల్దుర్తి మండలంలోని శ్రీరంగాపురం గ్రామ సమీపంలో గల కోటపేట శ్రీ ఆంజనేయస్వామి మరియు అవధూత శ్రీ శ్రీ శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద 15వ ఆరాధన మహోత్సవం సందర్భంగా న్యూ కేటగిరి ఎద్దుల బండలాగుడు పోటీలను సోమవారం నిర్వహించారు. శ్రీరంగాపురం గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆరాధన మహోత్సవానికి వచ్చిన భక్తులకు, అల్పాహారం, విందు ఏర్పాటు చేశారు. ఈ ఆరాధన సందర్భంగా న్యూ క్యాటగిరి గెలుపొందిన వృషభ రాజుకు మొదటి బహుమతి 50 వేలు, రెండవ బహుమతి 40 వేలు, మూడో బహుమతి 35 వేలు, నాలుగో బహుమతి 25 వేలు, ఐదో బహుమతి 15 వేలు, ఆరవ బహుమతి 10 వేలు, 7వ బహుమతి 5 వేలు గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో గెలుపొందిన వృషభ రాజులకు బహుమతులను ప్రధానం చేశారు. గ్రామ పెద్దమనుషులు సుంకి రెడ్డి, రామచంద్రారెడ్డి, వడ్డే వెంకటేశ్వర్లు, బాలకృష్ణ మాధవరావు, రవికుమార్, తదితర గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొన్నారు.