యర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనపై జిల్లా అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
సర్వసభ్య సమావేశంలో ప్రజల సమస్యలపై విరుచుకుపడిన వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
ఎర్రగొండపాలెం అఖండ భూమి.
ఆదివారం ఒంగోలులో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నియోజకవర్గంలోని పలు సమస్యలపై యర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు..యర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనపై జిల్లా అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.*ఒంగోలులో జెడ్పి సమావేశంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అభ్యర్థనను సానుకూలంగా స్పందించిన మంత్రి స్వామి యర్రగొండపాలెం జగనన్న కాలనిలో విద్యుత్ షాక్ కు గురై తీవ్ర గాయాలు అవ్వడంతో సరైన వైద్యం అందక బాధపడుతున్న పెద్ద పోగు గురవయ్య కు ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పిన మంత్రి స్వామి.
త్రిపురాంతకం నుండి యర్రగొండపాలెం రోడ్డు గుంతలతో వాహణదారులు ఇబ్బందులు పడుతుండడంతో నూతన డబుల్ రోడ్డు నిర్మాణం గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు..పుల్లలచెరువు నుండి యర్రగొండపాలెం రోడ్డు నిర్మాణం చేపట్టాలని అన్నారు.. యర్రగొండపాలెం నుండి పాలుట్ల రోడ్డు లేకపోవడమతో గిరిజనులు తీవ్ర ఇబ్బందుకు పడుతున్నారని,ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు గిరిజనులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని గిరిజనులకోసం రోడ్డు నిర్మాణం చేయాలని అన్నారు లేని పక్షంలో రోడ్డుకు మరమత్తులు చేయాలని అన్నారు..నియోజకవర్గంలోని గ్రామాలలో అంతర్గత రోడ్డులు నిర్మాణం చేయాలని అన్నారు.. నియోజకవర్గంలోని త్రాగునీటి సమస్యలు ఎక్కువ ఉన్నాయని నీటి సమస్యలు లేకుండా అధికారులు చూడాలని ప్రతి మండలం నుండి కనీసం 10 కొత్త బోర్లు ఎర్పాటు చేసి నీటి ఎద్దడి లేకుండా చూడాలని అన్నారు..యర్రగొండపాలెం నుండి ఒంగోలు కి బస్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజల సౌకర్యార్థం కోసం ఒక బస్సు ను ఎర్పాటు చేయాలని అన్నారు..యర్రగొండపాలెం టౌన్ లో అంతర్గత మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,యర్రగొండపాలెం లో అంతర్గత డ్రైనేజ్ ను నిర్మించాలని అన్నారు..యర్రగొండపాలెం నియోజకవర్గంలోని అటవీప్రాంతాల్లో ఉన్న గిరిజన నిర్వాసితులకు పక్కా గృహాలను మంజూరు చేయాలని అన్నారు.