వెల్దుర్తి పట్టణంలో అడ్డగోలుగా భవన నిర్మాణాలు…
– లక్షల్లో మేజర్ గ్రామపంచాయతీకి గండి
– పట్టించుకోని అధికారులు…
వెల్దుర్తి ఫిబ్రవరి 17 (అఖండ భూమి) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు. భవన నిర్మాణాలు అడ్డదిడ్డంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. భవనాలు నిర్మిస్తామని అనుమతి తీసుకొని కమర్షియల్ నిర్మాణాలు కొనసాగించి మేజర్ గ్రామపంచాయతీకి లక్షల్లో గండి కొడుతున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కొత్త భవనాలు నిర్మిస్తున్నప్పటికీ వాటికి కూడా అప్రూవల్ ఉన్నదా లేదా అన్న తనిఖీలు కూడా కొనసాగించడం లేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా పొగాకు కంపెనీలు ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్న వాటికి అనుమతులు ఉన్నాయా లేవా అన్న తనిఖీలు కూడా చేయడంలో విఫలం చెందిన గ్రామపంచాయతీ అధికారులు. ఈ అడ్డగోలు భవన నిర్మాణాలను నిర్మూలించి భవన నిర్మాణాల యజమానులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడకుండా చూడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ అధికారులపై ఉందని పట్టణ ప్రజలు తెలుపుతున్నారు.