పెద్దమ్మ దేవరకు సర్వం సిద్ధం చేసిన గ్రామస్తులు…
వెల్దుర్తి ఫిబ్రవరి 17 (అఖండ భూమి) : మండల పరిధిలోని ఎల్. బండ గ్రామంలో పెద్దమ్మ దేవరకు సర్వం సిద్ధం చేసినట్లు గ్రామ పెద్దమ్మ దేవర నిర్వాకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎల్లమ్మ, సుంకులమ్మ, పెద్దమ్మ, మారెమ్మ ఆలయాలను ముస్తాబ్ చేశారు. ఈ దేవవర దాదాపు 30 సంవత్సరాల తర్వాత పెద్దమ్మ దేవర జరుపుకోవడం గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవర హిందూ సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దేవర మహోత్సవము మంగళవారం, బుధవారం, గురువారం మూడు రోజులు పాటు జరుపుతున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ దేవర మహోత్సవానికి బంధుమిత్రులు, వచ్చి మొక్కలు తీర్చుకుంటారు. ఈ దేవర మహోత్సవంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.