నూకాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణము చేసిన
శ్రీరామ టెక్స్టై టైల్స్ అధినేత రాము
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఫిబ్రవరి 16 అఖండ భూమి న్యూస్ :
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల చమ్మ చింత గ్రామంలో పురాతనము నుండి వెలసిన శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయము శిథిలా వ్యవస్థలో తుప్పల విపరీతంగా పెరిగి అస్తవ్యస్తంగా ఉన్న ఆలయమును నర్సీపట్నం నివాసి శ్రీ శ్రీ రామ హోల్ సేల్ బట్టల వ్యాపార అధినేత రాంబాబు గతంలో ఆ గ్రామం వచ్చినప్పుడు చూసి నూకాలమ్మ అమ్మవారి దేవాలయమునకు మరమ్మతులు చేపడతామని గ్రామస్థులతో కలిసి ఐదు లక్షలు విరాళం ఇచ్చి ఆలయ పురం నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారి ఆలయంలో వేకు జామునే వేదమంత్రాలతో పూజలు అభిషేకములు హోమములో జరిపించి అనంతరం భక్తులకు ప్రసాదం పంచి సాయంత్రం అమ్మవారి ఆలయంలో హరి భజనలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమానికి అప్పన విజయభాస్కర్ కూలిసెట్టి జోగిరాజు కాసపు సత్తిబాబు అంబటి నూకరాజు కూనిశెట్టి రామకృష్ణ అంబటి రాజు తోకనాటి నానాజీ లక్కోజు సన్యాసిరావు రామోజీ సత్యనారాయణ గ్రామ ప్రజలు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు