చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్థానానికి భారీ విరాళం.
ఆలమూరు ఫిబ్రవరి 16 (అఖండ భూమి వెబ్ న్యూస్):
చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో
అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ క్రమంలో చింతలూరుకు చెందిన కీ.శే.ముత్యాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమార్తె, అల్లుడు అయిన మోదుకూరుకు చెందిన యడ్లపల్లి సత్యనారాయణ దంపతులు ఆదివారం నాడు రూ.1,01,116ల విరాళాన్ని ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు వినియోగించమని కోరుతూ దేవస్థానం కార్యనిర్వాహణాధికారికి అందజేశారు. ఆలయ అభివృద్ధికై భారీ విరాళాన్ని అందించిన దాతలను కార్యనిర్వహణాధికారి అభినందించారు. దేవస్థానం అభివృద్ధికి దాతలు స్పందించి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఈఓ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఆసాదులు, భక్తులు పాల్గొన్నారు.