ఎమ్మెల్యే సత్యప్రభ అదేశాలు మేరుకు గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం 

 

 

ఎమ్మెల్యే సత్యప్రభ అదేశాలు మేరుకు గ్రాడ్యుయేటు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం

కాకినాడ జిల్లా  నియోజకవర్గం

( అఖండభూమి ఫిబ్రవరి 20 )

శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజ ఆదేశాల మేరకు శంఖ వరం మండలం అన్నవరం గ్రామంలో నియోజవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు, నియోజవర్గ ప్రత్యేక పరిశీలకులు గంటా నూకరాజు ల ఆధ్వర్యంలో స్థానిక ఎన్డీఏ శ్రేణులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి కరపత్రాలు పంచుతూ ఓట్ల అభ్యర్థించారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుండి పోటీ చేయుచున్న పేరాబత్తుల రాజశేఖరం కి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మెట్ల రమణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారము లోకి వచ్చాక రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు రాబడుతూ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదములో నడిపిస్తున్నారని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తున్నారని అలాంటి నాయకుడికి యువత అంతా అండగా ఉండాలని రమణబాబు కోరారు.. ఎన్డీఏ కూడా నుండి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం కి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు.. గంటా నూకరాజు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ అంతా ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే ఎన్డీఏ కూటమి ను మరింత బలపరచవలసిన ఆవశ్యకత రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉందని, విద్యావేత్తలు, మేధావులు, యువకులు చంద్రబాబుకి అండగా ఉండాలని కోరారు.. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బద్ది రామారావు రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) , టిడిపి సీనియర్ నాయకులు పర్వత సురేష్, మెరపాల నరసయ్య, బొమ్మిడి సత్తిబాబు, రాజాల చిట్టిబాబు, పసుపులేటి చక్రి, పలివెల సతీష్ , బండారు సురేష్, కడుపుగట్ల కృష్ణ, డాక్టర్ లక్ష్మీనారాయణ, బద్ది రామకృష్ణ, యర్రా బత్తుల గోవింద నాయుడు , కర్రీ శివ గణేష్, మడ్డు వీరబాబు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!