శ్రీశైల దేవస్థానానికి శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల వారిచే పట్టువస్త్రాల సమర్పణ

 

 

శ్రీశైల దేవస్థానానికి శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల వారిచే పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం, ద్వారకా తిరుమల వారు ఈ రోజు స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.

ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ సత్యనారాయణమూర్తి ఈ పట్టువస్త్రాలను శ్రీ స్వామి అమ్మవార్లకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి. నటరాజారావు, అర్చకులు భాను, వేదపండితులు, సోమశేఖరశర్మ, వెంకటేశ్వరశర్మ,ఈ సమర్పణ కార్యక్రమంలో పాల్గొనగా

ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, దేవస్థాన అధికారులు, అర్చక స్వాములు, వేదపండితులు, ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులకు, అర్చకస్వాములకు స్వాగతం పలికారు.

తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.

అనంతరం మేళతాళాలతో సంప్రదాయబద్ధంగా శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించబడ్డాయి.

ఈ సందర్భంగా ద్వారక తిరుమల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ద్వారకాతిరుమల దేవస్థానం తరపున సంప్రదాయ బద్దంగా శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు. బ్రహోత్సవాలలో పెట్టువస్త్రాలను సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!