శాసనమండలి ఎన్నికలు ప్రచారం..
ఎస్ రాయవరం మండలం అఖండ భూమి న్యూస్ ఫిబ్రవరి 20 మండలంలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు ప్రచారంలో భాగంగా పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య మండలంలో గల వివిధ పాఠశాలలను సందర్శించి శ్రీనివాసులు నాయుడు కి ఓటు వేసి గెలిపించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. నాయుడు గెలుపు ఉపాధ్యాయుల భవిష్యత్తుకు మలుపు అని రాష్ట్ర నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆదినారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగు అధ్యక్షులు భద్ర రావు సమన్వయకర్త సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు