లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు.. ఆర్. వెంకటరమణ
కర్నూలు వైద్యం ఫిబ్రవరి 21 (అఖండ భూమి) :
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖధికారి డా ఆర్ వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా అడ్వైసోరీ కమిటీ మీటింగ్ (పిసి పి ఎన్డిటి ఆక్ట్) జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కొత్తస్కాన్ సెంటర్స్ తప్పనిసరిగా జిల్లా కమిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రతి 5 సంవత్సరాలకు రెన్యూవల్ చేసుకోవాలి, ఒక నెల ముందే అప్లై చేసుకోవాలి. స్కాన్ సెంటర్స్ ని కచ్చితంగా అధికారులు తనిఖీ చేయాలి, లింగ నిర్ధారణ నిషేద చట్టం పై జిల్లా లో విస్తృతంగా ఐసిడిఎస్ వారు, మహిళా సంఘాలు, పోలీస్ వారి సహకారం తో అవగాహనా కల్పించాలి అని అన్నారు.
పిసి పి ఎన్డిటి ఆక్ట్ శ్రీ సబ్ డిస్ట్రిక్ట్ మల్టీ మెంబర్ అప్రోఫ్రిఎట్ చైర్మన్ శ్రీ విశ్వనాద్, ఆర్డీవో నంద్యాల వారు మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారు, చేయమని ప్రొదాహించేవారి పై కఠిన చర్యలు ఉంటాయి అని అన్నారు. మరియు రెన్యువల్ కు వచ్చే ప్రతి స్కానింగ్ కేంద్రాలు హై పవర్ మిషన్ వాడాలని లేకపోతే రెన్యువల్ చేయడం జరగదని తెలియచేయడమైనది.
ప్రోగ్రాం ఆఫీసర్ పిసి పి ఎన్డిటి ఆక్ట్ శ్రీ రవీంద్రనాయిక్ (డెమో ) మాట్లాడుతూ చట్ట వ్యతిరేకంగా పరీక్షలు చేసిన వైద్యలుకు మొదటి సారి తప్పు కు 10 వేలు జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష, రెండవ సారి తప్పు చేస్తే 50వేలు, 5 సంవత్సరాల శిక్ష ఉంటుంది, మూడవ సారి అదే తప్పు చేస్తే వైద్యలు కౌన్సిల్ నుండి పేరు తొలగించడం జరుగుతుంది. జిల్లా లీగల్ అదికారి శ్రీమతి సుమలత మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు కు ప్రాచహిస్తే వారికీ 3సంవత్సరాల జైలు మరియు 50 వేలు జరిమానా, రెండవ సారికీ 5 సంవత్సరాలు జైలు మరియు లక్ష రూపాయలు జరిమానా విదించబడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమం లోస్త్రీల వైద్యులు పద్మజ చిన్నపిల్లలు వైద్యులు అరుణజ్యో, ఎన్జీవో లు మదర్ సొసైటీ ఎన్జీవో శ్రీ రామారావు మరియు శ్రీ పాల్ బర్డ్స్ ఎన్డీఓ పాల్గొన్నారు.