” నేను సైబర్ స్మార్ట్ కార్యక్రమం” …. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముమ్మరంగా సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాలు.
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు, విద్యార్ధులు అప్రమత్తంగా ఉండాలి… జిల్లా ఎస్పీ.
కర్నూలు క్రైమ్ ఫిబ్రవరి 21 (అఖండ భూమి వెబ్ న్యూస్ ) :
నూతనంగా శ్రీకారం చుట్టిన “ నేను సైబర్ స్మార్ట్ “ కార్యక్రమం పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో పోలీసు అధికారులు ప్రజలకు, విద్యార్దులకు అవగాహన కల్పిస్తున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు శుక్రవారం తెలిపారు.
సైబర్ నేరాల బారిన పడకూడదని కరపత్రాలు, లఘు చిత్రాలతో వివిధ కళాశాలలు, పాఠశాలలు , పట్టణాలు, గ్రామాలలో ప్రజలకు, విద్యార్ధులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
డిజిటల్ అరెస్టు, జాబ్ ఫ్రాడ్స్, కెవైసి ప్రాఢ్స్, ఇన్వెస్ట్ మెంట్స్ ప్రాడ్స్ , బ్యాంకు ఖాతాల ఓటిపిలు తెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దని , తెలియని లింకుల పై క్లిక్ చేయరాదని తెలియజేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 38 పోలీసు స్టేషన్ పరిధులలో 118 ” నేను సైబర్ స్మార్ట్ ” అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ అవగాహన కార్యక్రమాలలో 7,810 మంది ప్రజలకు, విద్యార్దులకు సైబర్ నేరాల బారిన పడకూడదని అవగాహన కల్పించారు.