ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
బెల్లంపల్లి మార్చి 27(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గురువారం హనుమాన్ బస్తి చెందిన మంతెన శివకుమార్,వయస్సు (30)అను వ్యక్తి హైదరాబాదులో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ జీవినం సాగించేవారు.సుమారు 8 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకున్నడు, అతని భార్య సుమారు ఆరు నెలల తర్వాత అతన్ని వదిలి వేరే పెళ్లి చేసుకోని వెళ్ళిపోయింది.శివకుమార్ యధావిదిగా తనపని తణు చేస్కుంటున్నా క్రమంలో సుమారు నాలుగు సంవత్సరాల కిందట అతనికి రోడ్ ప్రమాదం జరిగి ఎడమ కాలు విరిగి ఆనొప్పితో అతను చేసే డ్రైవర్ ఉద్యోగం సరిగ్గ చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో ఒంటరి తనoతో జీవితంపై విరక్తి చెంది గురువారం బెల్లంపల్లి హనుమాన్ బస్తిలోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయడని శివకుమార్ తల్లి మంతెన రామక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ
జీ.రాకేష్ కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామన్నారు…