ఫోక్స చట్టంపై ఉపాధ్యాయులకు అవగాహన

 

ఫోక్స చట్టంపై ఉపాధ్యాయులకు అవగాహన

యర్రగొండపాలెం ఎస్ఐ పి చౌడయ్య

యర్రగొండపాలెం అఖండ భూమి వెబ్ న్యూస్ :

ప్రస్తుత రోజుల్లో బాలికల పట్ల జాగ్రత్తగా ఉండాలని వారి పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఫోక్స చట్టం అమలు చేసి శిక్షలు విధిస్తామని యర్రగొండపాలెం ఎస్ఐ పి చౌడయ్య అన్నారు. మంగళవారం యర్రగొండపాలెం పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో విద్యాశాఖ అధికారులతో కలిసి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఫోక్సొ చట్టంపై

అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి చౌడయ్య మాట్లాడుతూ 2012 లో ఏర్పడిన ఫోక్సు చట్టం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలకు పోలీస్ వ్యవస్థ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పారు. వారి పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే కట్టిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.18 సంవత్సరాల్లోపు బాలికలకు బాల్య దశ నుంచే రాజ్యాంగం పట్ల సామాన్యమైన చట్టాల పట్ల అవగాహన కలిగించాలని సూచించారు. ఎంఈఓ పి ఆంజనేయులు మాట్లాడుతూ ఫోక్స చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక ఏదింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని సూచించారు.18 ఏళ్లలోపు వయసు గల పిల్లలపై ఏదింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. చట్టానికి లోబడి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిబ్బంది నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 మల్లు నాయక్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!