రాజివ్ యువ వికాస’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం అఖండ భూమి న్యూస్(30) మార్చ్
బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దైడి.సురేష్. భీంగల్
బాల్కొండ నియోజకవర్గం ప్రజలకు యువతకు రైతులకు కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధిని పెంపొందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన “రాజీవ్ యువ వికాసం” పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని “బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దైడి.సురేష్ అన్నారు. ఈ పథకం ను గ్రామాలలోని యువకులు వారి వారి ఊర్లలో అప్లై చేసే విధానంను కార్యకర్తలు అందరూ వివరించగలరు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో యువత సాధికారత, ఆర్థిక అభివృద్ధికి తన నిబద్ధతను పురార్ఘటిస్తూ పునరుద్గటిస్తూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు, మంత్రులు ఈ పథకం కోసం రూ 6000/-(ఆరు వేల కోట్లు) కేటాయించడం జరిగింది అని అన్నారు. ఈ పథకం కింద లక్ష రూపాయల వరకు రుణాలకు 80 శాతం సబ్సిడీ. రెండు లక్షల వరకు ఉన్నవారికి శాతం 70 సబ్సిడీ, మూడు లక్షల వరకు ఉన్న రుణాలకు 60 శాతం సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఈ పథకం షెడ్యూల్ కులాలు (ఎస్సీ) షెడ్యూల్ తెగలు (ఎస్టీ) వెనుకబడిన తరగతులు (బీసీ) ఈడబ్ల్యూఎస్ , మైనార్టీ వర్గాల యువతకు స్వయం ఉపాధి రుణాలను అందిస్తుందని ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించడానికి మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం లభిస్తుందని అన్నారు. దరఖాస్తు పరిశీలన వచ్చే నెలలో ప్రారంభమవుతుందని ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు జూన్ 2న తెలంగాణ నిర్మాణ దినోత్సవం రోజున రాయితీ రుణ మంజూరు పత్రాలు అందుతాయని తెలిపారు.