నేటితో ముగియనున్న వడ్డీ రాయితీ

 

నేటితో ముగియనున్న వడ్డీ రాయితీ

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం అఖండ భూమి న్యూస్  మార్చి 30 వెబ్ న్యూస్

తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనున్నట్టు మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ తెలిపారు ఆర్థిక సంవత్సరం చివరి కి చేరుకోవడంతో ఆదివారం సైతం ప్రత్యేక పన్ను వసూలు బృందంతో కలిసి ఇంటి పన్ను, వ్యాపార పన్నులను వసూలు చేశారు. ప్రభుత్వం ఇంట్రెస్ట్ పై 90 శాతం రాయితీ ప్రకటించిన నేపథ్యంలో చివరి రోజు వరకు ప్రజలు పన్నులు చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బకాయి దారులు ప్రభుత్వం కల్పించిన వడ్డీ రాయితీ వెసులుబాటును ఉపయోగించుకుని మున్సిపల్ కు చెల్లించాల్సిన టాక్స్ పే చేయాలని అన్నారు. పన్నులు చెల్లించడం ద్వార పట్టణం అభివృద్ధి చెందడానికి దోహద పడిన వారు అవుతారన్నారు. ఆదివారం అంజుమన్ కమిటీ తో పాటు ఇతర వర్గాల వారినుండి రూ 2లక్షల 50 వేయిల పన్నులు సేకరించారు. ఈ కార్యక్రమం లో పన్ను ప్రత్యేక వసూలు బృందం, మున్సిపల్ సిబ్బంది మేనేజర్ నరేందర్, ఆర్ఐ రాజేశ్వర్, పల్లికొండ శ్రీధర్, సున్నపు ఓంకార్, నవీన్, రాజేశ్వర్, మాణిక్యం, వెంకటేష్, రాజేందర్, భాను, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, రఘు, కాలిదాస్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!