వినాయక నగర్ కాలనీలో ఘనంగా ఉగాది పంచాంగ శ్రవనం, పచ్చడి వితరణ

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 30 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీ వినాయక నగర్ కాలనీలో ఉగాది పర్వదిన సందర్భంగా సురేష్ పంతులు ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ కాలనీవాసులు తెలిపారు. సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ పంచాంగ శ్రావణ అనంతరం పచ్చడి వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందనీ, ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చింతల లింగం, కోశాధికారి సునీల్ కుమార్ , రామకృష్ణ, అడ్వకేట్ తిరుపతి, డాక్టర్ రవీందర్, డి.రాజు, శ్రీనివాస్, కాలనీ పి ఆర్ ఓ సంజీవ్, ప్రవీణ్, నరసయ్య శ్రీనివాసరెడ్డి, నరేష్ రెడ్డి సంతోష్ రెడ్డి, చాట్ల శ్రీనివాస్ దత్తు, మహేష్ ,గంగయ్య, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


