అంబేద్కర్ ఆశయ సాధనే రాజ్యాంగ పరిరక్షణ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 5 (అఖండ భూమి న్యూస్);
జై భీమ్ జై బాపు జై సం విదాన్ కార్యక్రమాన్ని దోమకొండ మండలం సంగమేశ్వర్, గొట్టిముక్కుల గ్రామాలలో శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అనంతరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, పల్లె రామస్వామి గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అంబేద్కర్ ఆశయం సర్వమత సమానమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే దేశ ప్రజల జీవనస్థితిగతులు ప్రగతివైపు పయనించడం ఖాయమని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వల్ల భారత రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, గ్రామ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ,సంతోష్ రెడ్డి, సీతారాం మధు, నాయకులు నల్లపు శ్రీనివాస్, గోపాల్ రెడ్డి ,శమీ ,శంకర్, ఈశ్వర్ గౌడ్, శంకర్ రెడ్డి ,వినీత్ , రమేష్ ,మరి శేఖర్, బాల్ నర్స్, బాలరాజ్, నరేష్ ,రామ్ రెడ్డి, నహీం తదితరులు పాల్గొన్నారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



