తాడ్వాయి మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి..
తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడుదాం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఏప్రిల్ 12 (అఖండ భూమి న్యూస్);
అంబేద్కర్ జయంతి సందర్భంగా..
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఈ నెల 14వ తేదీ సోమవారం రోజున అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి తల సేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడాలి అన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,అధ్యక్షులు జమీల్ హైమద్ లు మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 20 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని వేసవికాలం కావడం వలన వారికి కావలసిన రక్త నిలువలు లేకపోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,వారి ప్రాణాలను కాపాడడం కోసం అంబేద్కర్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు.