దూసుకుపోతున్న అల్పపీడనం ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 10 (అఖండ భూమి న్యూస్)
ఆంద్ర కు మరొకసారి అకాల వర్షాల ముప్పు.
ఇంతకుముందు చెప్పినట్టుగానే పశ్చిమ బంగాళాఖాతంలో నిన్న ఒక అల్పపీడనం ఏర్పడింది ఇది మొదటి వాయువ్యంగా ప్రయాణించి ఉత్తరాంధ్ర దగ్గర, అటుపిమ్మట ఈశాన్యంగా ప్రయాణిస్తూ మియన్మార్ గా మరలనున్నాది. దీని వల్ల నేడు, 8,9 తారీఖుల్లో ఉత్తరాంధ్ర లో అక్కడక్కడా వర్షాలు పడితే 10,11,12,13 తారీఖు ల్లో ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్రా చేర్చి వున్న తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా, 14,1516 తారీఖు ల్లో ఆంధ్రప్రదేశ్ లో తీరం వెంబడి ఉన్న జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం రబీ వరి కోతలు, మాసుళ్ళు ముమ్మరంగా జరుగుతున్నాయి కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.