కొనసాగుతున్న ఎస్ ఎస్ ఎస్ వేసవి కాల ప్రత్యేక శిబిరం:..

 

కొనసాగుతున్న ఎస్ ఎస్ ఎస్ వేసవి కాల ప్రత్యేక శిబిరం:..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 10 (అఖండ భూమ న్యూస్) ;

తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం జాతీయ సేవా పథకం యూనిట్ -5, యూనిట్ -6 ఆధ్వర్యంలో చేపట్టిన వేసవికాల ప్రత్యేక శిబిరం నాలుగవ రోజుకు గురువారంతో చేరుకుంది.

ఎన్, ఎస్ ,ఎస్ వాలెంటరీలు దోమకొండ లోని బస్టాండ్ ఆవరణంలోని ప్లాస్టిక్ పెద్దాలను తొలగిస్తూ ర్యాలీగా బయలుదేరి గ్రామపంచాయతీ, మండల్ పరిషత్, తాసిల్దార్ కార్యాలయాల నుండి గడికోట వరకు ప్లాస్టిక్ పెద్దాంతలకిస్తే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని బలపరుస్తూ గడికోటకు పడమర ద్వారానికి ఎదురుగా ఉన్న ఒక గడ్డను పరిరక్షించడానికి ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్స్ శ్రమదానం చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పైన వారికి కావలసిన నైపుణ్యాల పైన సర్వే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బాబ్జి , ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ బి.అంజయ్య డాక్టర్ హరిత , ట్రస్టు కోఆర్డినేటర్ నేతుల గణేష్ యాదవ్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!