కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలి..

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 28 (అఖండ భూమి న్యూస్);
రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం నిజాంసాగర్ మండలం లోని గోర్గల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను కలెక్టర్ పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటది వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, కొనుగోళ్లు జరిగిన వాటి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ, వంటి ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు. రైతుల మాట్లాడుతూ, లారీల కొరత ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బిక్షపతి, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


