ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 28 (అఖండ భూమి న్యూస్);
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించే వెంటనే డిస్పోస్ చేయాలని అన్నారు. ఈ రోజు ప్రజావాణి లో (95)అర్జీలు రావడం జరిగాయని తెలిపారు.
ఈ ప్రజావాణిలో ఆర్డీఓ వీణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి మసూద్ అహ్మద్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.