సిద్దుల గుట్టపై చిరుత పులి సంచారం..
-దర్శనానికి ఎవరు రావద్దు..
-ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఏప్రిల్: 28 (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్ నవనాథ సిద్దుల గుట్టపై సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో దర్శనానికి వెళ్తున్న భక్తులకు చిరుత పులిని చూసి భయాందోళనకు గురయ్యారు. భక్తులు తీసిన చిరుత పులి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా చిరుత పులి సంచారం వాస్తవమేనని. భక్తులు అప్రమత్తంగా ఉండి సిద్దుల గుట్ట దర్శనానికి ఎవరు రావద్దని. భక్తులు సిద్దుల గుట్ట పైకి వెళ్లకుండా గేటును మూసివేసి పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని మంగళవారం వలవేసి చిరుతపులిని పట్టుకుంటారని. పోలీసులు సమాచారం ఇచ్చేవరకు ఇటువైపు ఎవరు రా వద్దని ఎస్ హెచ్ ఓ కోరారు.