జన , కుల గణన కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న బిసి ప్రజాప్రతినిధులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 1 (అఖండ భూమి న్యూస్);
రాష్ట్రంలో మొట్టమొదట కుల గణన చేపట్టడంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం గురువారం నిర్వహించి జనగణలతో పాటు కులగనన నిర్వహించాలని కేంద్ర కేబినెట్ ఆమోదం పొందినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి కుల గణన నిర్వహించి రాష్ట్ర అసెంబ్లీలలో ఆమోదం పొందపరిచి కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతోనే దేశం మొత్తంలో జన గణ మనతోపాటు కుల గణన నిర్వహించి ఆమోదం పొందుతున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లతో కలిసి సీఎంను అభినందించడం జరిగింద నీ షబ్బీర్ అలీ తెలిపారు. రాష్ట్రంలో జనగణన, కులగనగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.