పది ఫలితాల్లో నలంద టాప్ -100% ఉత్తీర్ణత..
-టాపర్ గా 575 స్వేజన్ రెడ్డి..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఏప్రిల్: 30 (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో గల నలంద హై స్కూల్ లో బుధవారం పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించగా జక్రాన్ పల్లి మండలం కలిగోట గ్రామానికి చెందిన ఎన్ స్వేజన్ 575/600 సాధించి టాపర్గా నిలిచాడు. వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన విద్యార్థులు భావన రెడ్డి 564.. సంకీర్తన 555.. మామిడిపల్లి కి చెందిన హలీమా 554.. సికింద్రాపూర్ కు చెందిన రక్షిత 546.. భీంగల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన వరుణ్ తేజ్ 542 మార్కులు సాధించి నలంద హై స్కూల్ టాపర్లుగా నిలిచారు. 23 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని నలంద స్కూల్ యాజమాన్యం ప్రసాద్ తెలిపారు.2024-25 అకాడమిక్ ఇయర్లో విద్యార్థులు ప్రతిభను చాటడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధిస్తూ ఆర్మూర్ మండలంలోని ప్రైవేట్ స్కూల్స్ లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యాసంస్థగా నిలవడం గర్వంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు శాలువా. పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు. విద్యార్థులు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


