గునుపూడి లో అతిగా విజృంభిస్తున్న పచ్చకామెర్ల వ్యాధి పట్టించుకోని అధికారులు, వైద్య సిబ్బంది

గునుపూడి లో అతిగా విజృంభిస్తున్న పచ్చకామెర్ల వ్యాధి- పట్టించుకోని అధికారులు, వైద్య సిబ్బంది

ఏప్రిల్ 30 నర్సీపట్నం (అఖండ భూమి న్యూస్).

నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం గునుపూడి గ్రామం లో చాపకిందినీరుల పచ్చ కామెర్ల వ్యాధి అతిగా విజృంభిన చేస్తుందని రోజురోజుకు పిల్లల్లో ఈ వ్యాధి కి గురైన వారి సంఖ్య పెరిగిపోతుంది. దీనిపై అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారు. తమకేమీ తెలీదు అనే స్థితిని అవలంబిస్తూ గడిపేస్తున్నారు. ఈ వ్యాధి సాధారణంగా నీరు కలుషితం కారణంగా హెపటైటిస్ (ఎ , బి, సి, డి, ఇ) వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. డెంగీ, మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు కంటే వేగంగా పచ్చకామెర్లు పిల్లల్లో అత్యధికంగా వ్యాపిస్తూ గునుపూడి గ్రామం లో తల్లిదండ్రులను ఆందోళనలకు గురిచేస్తుంది. పంచాయతీ అధికారులు గ్రామం లో బ్లీచింగ్ చల్లడమే మానేశారని ప్రజలు తెలిపారు. దీనిపై అధికారులు, వైద్య సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకోకపోతే పిల్లల ఆరోగ్యం మరింత పెను ప్రమాదం లో పడుతుందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!