భూభారతి చట్టంపై వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిష్కరించాలి.

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 30 (అఖండ భూమి న్యూస్);
భూ భారతి చట్టం పై పైలెట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట్ మండలంలో నిర్వహించిన రైతు సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిష్కరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం లింగంపేట్ ఎంపీడీఓ కార్యాలయంలో రెవిన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 17 నుండి 30 వరకు లింగంపేట్ మండలంలోని 23 రెవిన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టవలసి ఉంటుందని తెలిపారు. సుమారు 3700 దరఖాస్తులు రావడం జరిగిందని, అట్టి దరఖాస్తులను పరిశీలించి చట్ట. ప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకునేందుకు 9 టీమ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అట్టి టీమ్ లలో తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, సర్వేయర్స్ లను నియమిస్తామని తెలిపారు. ప్రతీ టీమ్ కు సుమారు 400 దరఖాస్తులు పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ఆయ సిబ్బంది విధులు నిర్వహించుటకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. టీమ్ లకు కావసిన ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ కు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ ప్రభాకర్, లింగంపేట్ తహసీల్దార్ సురేష్, భూ భారతి ప్రత్యేక అధికారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


