భవనం పై నుండి దూకి ఆత్మహత్య..!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటుందా పూజిత అనే వివాహిక వయసు రెండు అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. గత ఏడు నెలల క్రితం సాయికుమార్ అనే వ్యక్తితో పూజితకు వివాహం జరిగిందని తెలిపారు. కాగా పూజిత ఆత్మహత్యకి భర్త వేధింపులుకారణమంటూ పూజిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లయిన నాటి నుంచి తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుందివి అని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.