ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో చిట్యాల గ్రామంలో 2.11 కోట్ల రూపాయల నిధులతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డిజిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో రూ.2.11 కోట్ల నిధులతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. గతంలో తాడ్వాయి మండలంలోని 11 నుండి 14 గ్రామాల రైతులు మరియు గ్రామస్థుల కోరిక మేరకు సంబంధిత అధికారులతో & మంత్రి గారితో మాట్లాడి ఈ విద్యుత్ ఉపకేంద్రం మంజురుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు నిరంతరం కృషి చేశారు.
ఈ సందర్భంగా చిట్యాల గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారికి అఖండ స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీలు, పూలవర్షాలు, జయజయకారాలతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, “తాడ్వాయి మండల పరిధిలోని 11 నుండి 14 గ్రామాలకు చెందిన రైతులు మరియు గ్రామస్థులు విద్యుత్ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కొత్త విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణంతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది,” అని పేర్కొన్నారు.
అధికారులు మరియు కాంట్రాక్టర్లతో చర్చించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి మరిన్ని పథకాలు తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, మండల మరియు గ్రామ యూత్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.