హత్య కేసులో బెయిల్ కోసం అప్పు…
అప్పు తిరిగి ఇవ్వడం లేదు అని హత్య..
హత్య కేసు 48 గంటల్లోనే చేదించిన పోలీసులు…
నేరస్తుడి అరెస్ట్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని నరసన్న పల్లి గ్రామం లో గత నెల 30న మహిళా హత్య కేసులో పోలీసులు 48 గంటల్లోనే చేదించారు. జిల్లా ఎస్పీ రాజచంద్ర శుక్రవారం వివేకన సమావేశం ఏర్పాటు చేసి సందర్భంగా మాట్లాడారు. నరసన్న పల్లి గ్రామ వ్యవసాయ క్షేత్రం వద్ద చిదుర కవిత ( 44) మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు చీరతో ఉరివేసి హత్య చేశారు. ఈనెల ఒకటిన ఆమె భర్త గంగారెడ్డి దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. కామారెడ్డి రమ రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై గంగరాజు ఆధ్వర్యంలో విచారణలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. సాంకేతిక సహాయంతో దోమకొండ మండలం చింతవంపల్లి కి చెందిన జంగంపల్లి మహేష్ అనే పాత నేరస్తుని అదుపులోకి తీసుకొని విచారించడంతో కవిత హత్య కేసు పొలికి వచ్చింది. జంగంపల్లి మహేష్ పై మరో హత్య కేసు భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ కేసులో బయటపడాలని బెయిల్ కొరకు కవిత వద్ద మహేష్ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈనెల 30న వ్యవసాయ భూమికి వద్దకు వస్తే డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికాడు. అక్కడికి వచ్చిన కవిత ముక్కుపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె కింద పడి పోగానే చీర కొంగు తో ఉరిబిగించి ఊపిరి ఆడకుండా హత్య చేసినట్లు తెలిపారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం నగలు సెల్ ఫోన్ తీసుకొని పరారీ అయ్యాడు. మహేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చాకచక్యంగా పరిష్కరించిన పోలీస్ అధికారులను క్రైమ్ టీం సిబ్బందిని ఎస్పీ రాజచంద్ర అభినందించారు.