కామారెడ్డి జిల్లా లోని పంచాయతీ కార్యదర్శులకు ఆర్ టి ఐ ఫై అవగాహన సదస్సు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 2,( అఖండ భూమి న్యూస్) ;
భారత ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలుప్రజా ఫిర్యాదుల విభాగం (DARPG), సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహకారంతో, డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, తెలంగాణ ఏర్పాటు చేసిన ‘సమాచార హక్కు గ్రామసభ కోసం సామర్థ్య నిర్మాణంపై కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, తెలంగాణ భాగస్వామ్యంతో కామారెడ్డి ఐ డి ఓ సి నందు పంచాయతీ కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ. ఆశిష్ సంగ్వాన్ గారు హాజరై సలహాలు సూచనలు ఇచ్చి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొనుటకు పంచాయతి కార్యదర్శులకు సుచించినారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 ప్రకారం గ్రామ సభ యొక్క పాత్ర, మెరుగైన స్థానిక పాలన కోసం ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలనను ప్రోత్సహించడం, సమాచార హక్కు చట్టం మరియు స్వచ్ఛందంగా సమాచారం వెల్లడించడం ద్వారా పారదర్శకతను ప్రోత్సహించడం, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక బృందాలు, పౌర సమాజ సంస్థలతో సమన్వయంతో గ్రామ సభలను బలోపేతం చేయడం, మహిళా-స్నేహపూర్వక గ్రామ పంచాయతీలను ప్రోత్సహించడం, మహిళా సాధికారత మరియు బాలల సంరక్షణకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడింది.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయిలో పారదర్శకతను ప్రోత్సహించడం, సమాచార హక్కు చట్టం-2005, పంచాయతీ కార్యదర్శి పాత్ర, గ్రామ సభసమాచార హక్కువంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. అలాగే, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన యొక్క ప్రాముఖ్యత, మహిళా గ్రామ సభలు, గ్రామ సభ నిర్వహణలో పంచాయతీ కార్యదర్శి పాత్ర , వివిధ శాఖలు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వ్యూహాలపై చర్చించారు. అనంతరం మహిళా గ్రామ సభల ద్వారా మహిళా మరియు శిశు-స్నేహపూర్వక గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రతి మండలానికి ఇద్దరు చొప్పున పంచాయతీ కార్యదర్శులు పాల్గొనగా ఇట్టి కార్యక్రమమునకు శ్రీ. యం.రాజేందర్ ఇంచార్జ్ శ్రీమతి. పి.సవిత తదితరులు పాల్గొన్నారు.