కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా మే 20న బీడీ పరిశ్రమ లో జరిగే సమ్మెను విజయవంతం చేయండి…
సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 5 (అఖండ భూమి న్యూస్);
మే 20న దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమ రక్షణకై 1000 బీడీలకు కూలి 750 ఇవ్వాలని ,26 రోజులు కార్ఖానా నడిపించాలని రాజీనామా చేసిన కార్మికులకు కనీస పెన్షన్ 10000 ఇవ్వాలని కార్మికులకు పక్కా గృహాలు కాలనీలో నిర్మించాలని వారి పిల్లలకు స్కాలర్ షిప్పులు ఇవ్వాలని బీడీ కంపెనీ యాజమాన్యాలు కార్మికుల దగ్గర గుంజుకునే 2000 బీడీలు మాఫీ చేయాలని జరిగే జాతీయ సమ్మెలో బీడీ కార్మికులు అందరూ కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఐ టి యు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ సోమవారం డిమాండ్ చేశారు.
అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.
మే 20న జరిగే సమ్మెకు సంబంధించిన నోటీసులను బీడీ యాజమాన్యాలకు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దేశాయ్, వాణి, సూపర్ శివాజీ, ఠాగూర్ లంగర్ వి ఎస్ ఠాకూర్, దీపక్ గోట్ మార్క్ ,ఇండియన్ టొబాకో ఈ బీడీ కంపెనీల యజమానులకు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది.
కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ పరిశ్రమను నాశనం చేసి సీక్రెట్ కంపెనీలకు ఉపయోగం జరిగే విధంగా చర్యలు చేపట్టిందని దీనివల్ల బీడీ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాదిమంది బీడీ కార్మికులు పని దినాలు తగ్గిపోయి రేట్లు పెరుగక దోపిడీకి గురవుతున్నారని అన్నారు.
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ పరిశ్రమపై 18 శాతం జీఎస్టీ వేసి పరిశ్రమ నడ్డి విరిగొట్టిందని , కార్మికులకు వచ్చే హౌసింగ్ స్కీమ్ ను రద్దు చేసిందని వారి పిల్లలకు ఇచ్చే స్కాలర్షిప్లను ఆపేసిందని అన్నారు.
ప్రధానంగా ప్రభుత్వ చర్యల వల్ల పని దినాలు నష్టపోయి 26 రోజులు నడవాల్సిన కారణాలు ప్రస్తుతం 10 ,11 రోజులు మాత్రమే నడుస్తున్నాయి కనీస వేతనం ఒక 1000 బీడీలకు 750 రూపాయలు ఇవ్వాల్సింది పోయి 250 రూపాయలు మాత్రమే యజమానియాలు చెల్లిస్తున్నాయి అన్నారు. ప్రభుత్వము కోబ్రా చట్టం పెట్టి పై నుండి ఇబ్బందుల గురిచేస్తుంది తక్కువ కూలే ఇస్తున్న యజమాన్యాల మీద చర్యలు తీసుకోకపోగా యజమాన్యాలు కార్మికులను వేధించడానికి ఉపయోగపడే చట్టాలను కార్మికులకు అనుకూలంగా ఉన్న వాటిని రద్దుచేసి, 44 చట్టాలు ఉంటే వాటిని రద్దు చేసి, నాలుగు కోడ్ బిల్లులు యజమాన్యం అనుకూలంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం తయారు చేస్తా ఉన్నది అని అన్నారు. ఒక్క మన జిల్లాలోనే 1,50,000 మంది కార్మికులు నష్టం పోతున్నారు. కనీసం ఈఎస్ఐ హాస్పిటల్స్ సౌకర్యం లేదు పనిచేసే కార్మికుల నుండి కొన్ని పెద్ద బీడీ కంపెనీలు వాళ్ల కష్టార్జితం నెలకు రెండు వేల బీడీలను గుంజుకుంటున్నది అని అన్నారు. రాజీనామా చేసిన కార్మికులకు కనీస పెన్షన్ 600, 700 రావడం సిగ్గుచేటు అని అన్నారు.
మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికుల ప్రధాన డిమాండ్లైన కనీస వేతనం ఒక 1000 బీడీలకు 750 రూపాయలు ఇవ్వాలని 26 రోజులు కార్ఖానాలు నడిపించాలని ,కార్మికులకు పక్కా ఇండ్లు మంజూరు చేయాలని వారి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం మంజూరు చేయాలని యజమాన్యాలు అక్రమంగా వసూలు చేస్తున్న 2000 బీడీలను మాఫీ చేయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అరుణ్, రాజనర్సు,
పురుషోత్తం ,చక్రపాణి, రాములు,ప్రభు
తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…