ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 5 (అఖండ భూమి న్యూస్);
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈ రోజు ప్రజావాణి లో (96) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యా సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగులో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తు దారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో చందర్, ఆర్డీఓ వీణ, పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


