జీడిపిక్కల రైతులను నిలువునా దోచుకుంటున్న దళారులు.

 

మూడు రోజుల్లో 30 రూపాయల తగ్గిన జీడి మామిడి రేటు

అల్లూరి జిల్లా రంపచోడవరం/ గూడెం కొత్తవీధి (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా

రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పందిరి మామిడి జంక్షన్ వద్ద దళారుల ఆధ్వర్యంలో సంవత్సరాల పాటుగా జీడి మామిడి పిక్కల వ్యాపారం మూడు పూలు ఆరు పిక్కలు గా కొనసాగుతుంది. దళారులు ఆడిందే ఆట పాడిందే పాట అనే సందనంగా రైతులనే టార్గెట్ చేసుకొని రోజురోజుకు రేటు తగ్గించి పూటకో మాట చెబుతూ రైతులు తీసుకువచ్చిన జీడిమాడి పిక్కలను తక్కువ ధరలకు కొని సొమ్ము చేసుకుంటున్నారు. పిక్క నల్లబడింది.. నాసుగా ఉంది పలు కారణాలతో రైతు దగ్గర నుండి దళారులు తమ ఇష్టాను సారంగా పిక్కలు కొనుబడే చేస్తూ, తమ ఇష్టమైన రేట్లను రైతుకు చెల్లిస్తూ రైతు కష్టాన్ని దోసుకుంటున్నారు…. కేజీ 50 రూపాయలు చేసి కొంటూ…

10 కేజీలకు తరుగు కేజీ రెండు కేజీలు తీసుకుంటూ రైతులను మోసం చేస్తున్నారు… ఈ తరహా పై అధికారులు కన్నెత్తి చూసిన పాపను పోలేదు.. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా లేక రైతు ఏమై పోయిన పర్వాలేదని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారా అనే అయోమయంలో రైతులు ఉన్నారు… ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. దళారుల దోపిడిని అరికట్టి ఐటీడీఏ ద్వారా జీడిపిక్కలను సేకరించాలని పలువురు కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!