సిఐటియు నిరంతర పోరాట ఫలితమే జీవో నెంబర్ 306
– పోరాడి సాధించుకున్న మినీ అంగన్వాడీ టీచర్లు
– సిఐటియు జిల్లా అధ్యక్షుడు కే చంద్రశేఖర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 8 (అఖండ భూమి న్యూస్);
సిఐటియు నిరంతర పోరాట ఫలితమే జీవో నెంబర్ 36 అని సిఐటియు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సిఐటియు నిరంతర పోరాట ఫలితమే జీవో నెంబర్
306 విడుదల అని మినీ అంగన్వాడీ టీచర్స్ ను మెయిన్ అంగన్వాడీ టీచర్స్ గా అప్డేట్ చేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించి సిఐటియు ఆధ్వర్యంలో ఏప్రిల్ 24 న కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలకు డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడికి నిరంతరం చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్స్ ను మెయిన్ అంగన్వాడీ టీచర్స్ గా అప్ గ్రేడ్ చేస్తూ 306 జీవోను విడుదల చేసిందన్నారు. పోరాడి విజయం సాధించిన నాలుగువేల మంది మినీ అంగన్వాడీ టీచర్లకు అభినందనలు, వారికి అండగా నిలబడ్డ మెయిన్ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జీవోలో 12 నెలల పెండింగ్ వేతన బకాయిల పైన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని తక్షణమే స్పష్టత ఇవ్వాలన్నారు. 12 నెలల పెండింగ్ వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని, పెండింగ్ వేతనాలకు సరిపడా బడ్జెట్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అప్డేట్ చేసిన మినీ అంగన్వాడి కేంద్రాలకు ఆయాలను కేటాయించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు, సిఐటియు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
You may also like
ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గులు వేసిన సర్పంచ్ ఐరేని నరసయ్య…
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.



