నిరుపేద అమ్మాయి పెళ్లి కి అండగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర
చైర్మన్ డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంద రాజమణి బాలయ్య కుమార్తె లావణ్య కు వివాహం ఉన్నందున నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో వారికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ,స్వప్న దంపతులు పుస్తే మట్టెలు,చీర గాజులు అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ. ఉప్పల శ్రీనివాస్ గుప్తా 53 వ జన్మదినం సందర్భంగా పుస్తె మట్టేలను అందజేయడం జరిగిందని,వేలాది మంది పేదింటి ఆడబిడ్డల వివాహానికి పుస్తే మట్టెలు చీర,గాజులను అందజేయడం మానవతా దృక్పథానికి నిదర్శనం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్, ఉపాధ్యక్షులు వెంకటరమణ లు పాల్గొనడం జరిగింది.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



