బాధిత కుటుంబానికి అండగా ఉంటా

-కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 11(అఖండ భూమి న్యూస్);
మందు పాతర పేలి మృతి చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం పాల్వంచలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు
ఇటీవల ఆపరేషన్ కగార్ లో భాగంగా ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్ లు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి వీర మరణం పొందిన కామారెడ్డి నియోజకవర్గం పల్వంచ మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి శ్రీధర్ మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ద్వారా మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


