వదిలివేయబడిన వాహనాలను గుర్తించి 6 నెలల్లోగా తీసుకుపోవాలి
– జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 17. (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాలలో వదిలివేయబడ్డ లేదా పట్టుబడిన వాహనాలను చట్టపరమైన ప్రక్రియలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆద్వర్యంలో వేలం వేయడం జరుగుతుంది. ప్రస్తుతం 217 వాహనాలు (211 టూవీలర్లు, 3 త్రీ వీలర్లు, 3 ఫోర్వీలర్లు) కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో భద్రపరచబడ్డాయనీ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. వాహన యజమానులు తమ వాహనాన్ని గుర్తించి, సరైన ధ్రువపత్రాలతో పోలీస్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి ఏ. నవీన్ కుమార్ ( 8712525970 / 8712686111) ను సంప్రదించి, ధ్రువపత్రాలను చూపించి వాహనాన్ని తీసుకు వెళ్లాలన్నారు. యజమానులు వాహనాన్ని తిరిగి పొందేందుకు 6 నెలల గడువు కలదు. గడువు పూర్తి అయిన తర్వాత, వాహనాలు గురుతు తెలియని, గుర్తించలేని ప్రాపర్టీ గా పరిగణించబడి వేలం వేయడం జరుగుతుందనీ ఆ ప్రకటనలో తెలిపారు. వాహనాల పూర్తి వివరాలు కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పొందుపరచబడ్డాయన్నారు.
ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, సూచించారు.