ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 17 (అఖండ భూమి న్యూస్) :
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని భయంపల్లి గ్రామానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజా మాజీ సర్పంచ్ కండ్లపల్లి బాలయ్య మాజీ ఎంపీటీసీ పచ్చింటి. సాయిలు, చింతల సాయిలు, గుట్టమీద సాయిలు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ. గత 20 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరగని అభివృద్ధి మదన్ మోహన్ గెలిచిన 16 నెలల్లో చేసి చూపించారు అని అన్నారు. గ్రామంలో ప్రభుత్వ పధకాలు, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజల ఇంటికి వచ్చి సమస్యలు పై తీరుస్తున్నారు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్న అభివృద్ధిలో భాగం అవ్వాలని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో లింగంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.