ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…

 

ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 16 (అఖండ భూమి న్యూస్) :

ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి లు అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రం దోమకొండలో 12 ఇండ్ల స్థలాలలో నిర్మాణానికి ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. బీసీలకు ఐదు లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇచ్చి ఇల్లు లేని పేదవారికి పక్కా ఇల్లు కట్టించడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే తెల్ల కార్డు ఉన్న ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తూ దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సీతారాం మధు, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ ,జడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్, నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి,శంకర్ రెడ్డి, నరసారెడ్డి నల్లపు శ్రీనివాస్ పులబోయిన రమేష్,శమ్మి, కొండ అంజయ్య నాగారపు రాములు అబ్రబోయిన రాజేందర్ ,నగరం నర్సింలు, ఎల్లం ,మల్లేశం , ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,గ్రామ కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!