భారతీయ వారసత్వ సంపద యోగా:
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 23 (అఖండ భూమి న్యూస్);
2014 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో Yoga for One Earth, One Health అనే థీమ్ తో అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయి ,ఆ మార్గదర్శకాల మేరకు హరిత యోగ, యోగ సమావేశం యోగ వాక్, యోగ సంగమం, యోగ ప్రభావ అనే కార్యక్రమాలు నాలుగు వారాల పాటు మే 27 నుంచి జూన్ 21 వరకు గ్రామ, మండల స్థాయిలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల మెడికల్ ఆఫీసర్స్ ల పర్యవేక్షణలో యోగా శిక్షకుల చేత common యోగా protocol కి అనుగుణంగా యోగా సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది అని , ఈ కార్యక్రమం జిల్లాలో ఉన్న స్కూల్స్ కాలేజీలో కూడా ప్రచారం చేస్తూ ఇందులో సీనియర్ సిటిజన్స్ , నాయకులు , ప్రతినిధులు యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతూ సమగ్ర ఆరోగ్య సాధనలో యోగ ప్రాధాన్యత తెలియచేస్తూ ,శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటూ భావితరాలకు మన దేశ వారసత్వాన్ని , సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్ ఆకాంక్షించారు .



