కారుణ్య నియామకాల్లో భాగంగా ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగ ఉత్తర్వులు అందజేత…
*• కారుణ్య నియామకాల్లో భాగంగా రెండు నెలలోపే ప్రభుత్వ ఉద్యోగ ఉత్తర్వులు అందజేసిన జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 19 (అఖండ భూమి న్యూస్);
కారుణ్య నియామకాల్లో భాగంగా రెండు నెలల క్రితం విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ వడ్ల రవి భార్య సౌఖ్యకు, అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ కుమార్తె మానసకు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా ఎస్పి యం, రాజేష్ చంద్ర ఐపిఎస్ సోమవారం అందజేశారు.
విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు విడతలవారీగా కారుణ్య నియామకాలలో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఉద్యోగాల్లో నియామితులైన సౌఖ్య, మానసలకు అభినందనలు తెలుపుతూ, నిజాయితీగా విధులు నిర్వహిస్తూ డిపార్ట్మెంట్‌కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కే. నరసింహారెడ్డి ఏఓ యండి. అప్సర్ , సూపరింటెండెంట్లు గంగాధర్, జామీల్అలీ తదితరులు పాల్గొన్నారు. రెండు నెలల లోపే ఉద్యోగం ఇచ్చినందుకు జిల్లా పోలీస్ సిబ్బంది ఎస్పీ కీ కృతజ్ఞతలు తెలిపారు.



