నాకు పునర్జన్మను ప్రసాదించండి..
-నన్ను బ్రతికించండి..నాకు బ్రతకాలని ఉంది.
-8688365656 నెంబర్ కు ఫోన్ పే చేసి..
-ఆపన్న హస్తం అందివ్వండి..
-కొండ్రపేట నరేష్ ఆవేదన..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ మే: 24 (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్.. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన కొండ్రపేట నరేష్ నిరుపేద కుటుంబం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న నరేష్ కు గత పది రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ప్రస్తుతం హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. రోజుకు సుమారు మూడు లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు తేల్చి చెప్పారు. నరేష్ కుటుంబానికి ఆర్థిక స్తోమత లేదు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నరేష్ కు ఆర్థిక సహాయం ఎంతో అవసరం, దాతలు, ప్రజా ప్రతినిధులు ఆదుకుని నరేష్ కు పునర్జన్మను ప్రసాదించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.



